హైకోర్టులో బాంబు కలకలం!.. పోలీసులు హై అలర్ట్.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
Published: Jan 24, 2023, 4:51 PM


హైకోర్టులో బాంబు కలకలం!.. పోలీసులు హై అలర్ట్.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్..
Published: Jan 24, 2023, 4:51 PM
హైకోర్టులో బాంబు కలకలం రేపింది!. కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖలు పంపారు. పంజాబ్-హరియాణా హైకోర్టుతోపాటు చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు లేఖలు వచ్చాయి.
పంజాబ్-హరియాణా హైకోర్టు, చండీగఢ్ జిల్లా కోర్టు, పంచకూల కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపు లేఖలు కలకలం సృష్టించాయి. ఆ లేఖలో కోర్టుల్ని పేల్చేస్తామని దుండగులు పేర్కొన్నారు. న్యాయమూర్తి కాంప్లెక్స్‌లో బాంబు పెట్టామని.. అది మధ్యాహ్నం ఒంటి గంటకు పేలుతుందని చెప్పారు. బాంబు సమాచారం అందుకున్న పంచకూల పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అనంతరం కోర్టు పరిసరాల్లో ఉన్నవారందరినీ బయటకు పంపించి.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, బాంబు బెదిరింపు లేఖ తమకు వచ్చిందని ఏసీపీ సురేంద్ర యాదవ్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఈ ఘటన జరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. మొదట మాక్ డ్రిల్స్ అని చెప్పిన పోలీసులు.. తర్వాత బాంబు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలిపారు.
