మేనకోడలి పెళ్లికి రూ.3 కోట్ల కట్నం ఇచ్చిన మేనమామలు.. ట్రాక్టర్​, ఫ్లాట్​ కూడా.. అక్కడ అదే సంప్రదాయమట!

author img

By

Published : Mar 17, 2023, 8:15 AM IST

biggest-myra-ever-given-in-nagaur-of-rajathan-amount-crossed-three-crores

మేనకోడలి పెళ్లికి భారీగా విరాళం అందించారు ముగ్గురు సోదరులు. మొత్తం రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను మేనకోడలి పెళ్లికి కట్నంగా అందించారు. రాజస్థాన్​లో జరిగిందీ ఘటన.

మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు ముగ్గురు సోదరులు. అందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రింగ్ రోడ్డు పక్కన 30 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉంది. అలాగే 41 తులాల బంగారం, మూడు కేజీల వెండిని మేనకోడలికి కట్నంగా ఇచ్చారు. ట్రాక్టర్, స్కూటీని సైతం మేనకోడలికి కానుకగా ఇచ్చారు ఈ ముగ్గురు సోదరులు. అదే విధంగా ఊర్లోని ప్రతి ఇంటికి ఓ వెండి నాణేన్నిపెళ్లి గిఫ్ట్​గా ఇచ్చారు. రాజస్థాన్​కు చెందిన ముగ్గురు రైతు సోదురులు తమ మేనకోడలి వివాహానికి ఈ భారీ విరాళాన్ని అందించారు. వీరిది నాగౌర్​ జిల్లాలోని బుర్డీ అనే గ్రామం.

భన్వర్‌లాల్ గర్వాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్ర అనే ముగ్గురు అన్నదమ్ములు ఈ భారీ మొత్తాన్ని తమ మేనకోడళి పెళ్లికి కానుకగా ఇచ్చారు. ఈ ముగ్గురు అన్నదమ్ములు 2,166 ఎకరాల భూమిని కలిగి ఉండి.. ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. భన్వర్‌లాల్​ కూతురు పేరు అనుష్క. ఈమెది దింసరి గ్రామం. అనుష్క కూతురు పెళ్లి సందర్భంగానే ఈ కట్నకానుకలిచ్చారు మేనమామలు. నగదు రూపంలో రూ.80 లక్షలు ఇచ్చారు.

మైరా సంప్రదాయం..
అయితే బుర్డీ గ్రామంలో మైరా సంప్రదాయం ఉంది. దీని ప్రకారం మేనకోడలి వివాహానికి మేనమామలే కట్నకానుకలు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే 'మైరా'గా పిలుస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లిలో ఇది ఒక భాగం. చెల్లెలికి ఆర్థిక భారం తగ్గించేందుకు ఆమె సోదరులు ఈ మైరాను అందజేస్తారు. ఈ మైరాలో సోదరి కుమార్తె పెళ్లికి మేనమామలే కట్నకానుకలు భరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మేనకోడలి పెళ్లి వేడుకను మేనమామలే దగ్గరుండి జరిపిస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఎవరూ మేనకోడళ్ల పెళ్లికి ఇవ్వనంత కట్నకానుకలను ఇచ్చి రికార్డు నెలకొల్పారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. ఏకంగా రూ. 3.21 కోట్ల విలువ చేసే నగదు, బహుమతులను పెళ్లికి కట్నంగా ఇచ్చారు. కేవలం మేనకోడలి వివాహానికి మాత్రమే కాకుండా మేనల్లుడి పెళ్లికి అయ్యే ఖర్చులను కూడా.. మేనమామలు భరించే సంప్రదాయం ఈ గ్రామంలో ఉంది.

"ఇది మా చెల్లి కూతురు పెళ్లి. దీన్ని చాలా కాలం గుర్తుండిపోయేలా మేము చేద్దాం అనుకున్నాం. అందుకే భారీ మైరాను మా మేనకోడలికి ఇచ్చాం. మేమిచ్చిన కట్నకానుకలతో వధువు, వరుడు కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. వధూవరులిద్దిరికీ శుభాకాంక్షలు.' అని వధువు మేనమామలు తెలిపారు. ఇప్పుడు ఈ వధువుకు ఇచ్చిన మైరా.. నాగౌర్​​ జిల్లాలో రికార్డ్​ బ్రేక్​ చేసింది. ఇంతకముందెనప్పుడు ఇంతమొత్తంలో మైరా ఎవ్వరు ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.