ETV Bharat / bharat

'పాక్​తో చర్చలా? అంతా అబద్ధం!'

author img

By

Published : Oct 15, 2020, 5:58 PM IST

Updated : Oct 15, 2020, 6:19 PM IST

పాకిస్థాన్​తో చర్చలు జరిపేందుకు ప్రయత్నించడం లేదని భారత్​ స్పష్టం చేసింది. భారత్​ తమను సంప్రదిస్తోందని పాక్​ ప్రధానికి జతీయ సలహాదారు చేసిన వ్యాఖ్యలను విదేశాంగశాఖ ఖండించింది. ఆయన వ్యాఖ్యల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.

India has not sent any message to Pak expressing desire for talks: MEA
'పాక్​తో చర్చలా? అలాంటిదేం లేదు'

తమతో సంప్రదింపులు జరిపేందుకు భారత్​ ప్రయత్నిస్తోందన్న పాకిస్థాన్​ ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు మోయిద్​ యూసఫ్​ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. యూసఫ్​ మాటల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.

"ఆయన(యూసఫ్​) వ్యాఖ్యల్లో నిజం లేదు. చర్చల కోసం పాకిస్థాన్​కు భారత్​ ఎలాంటి సందేశాలు పంపలేదు."

--- అనురాగ్​ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి.

ఓ వార్తాసంస్థకు ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చారు మోయిద్​ యూసఫ్​. పాక్​తో చర్చలు జరిపేందుకు భారత సందేశాలు పంపుతోందన్నారు. ఈ ఇంటర్వ్యూలో.. కశ్మీర్​ అంశాన్ని కూడా లేవనెత్తారు యూసఫ్​.

ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన అనురాగ్​ శ్రీవాస్తవ.. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాక్​ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు.

"ఇంటర్వ్యూకు సంబంధించిన వార్తను మేము చూశాం. భారత అంతర్గత వ్యవహారాలపై యూసఫ్​ మాట్లాడారు. సొంత వైఫల్యాలను కప్పిపుచుకునేందుకే పాక్​ ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. తమ దేశ ప్రజలను తప్పుదారి పట్టించేందుకే భారత్​ పేరును ప్రతిరోజు ప్రస్తావిస్తోంది."

--- అనురాగ్​ శ్రీవాస్తవ, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి.

'చైనాకు ఆ హక్కు లేదు'

తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు చైనాకు లేదని తేల్చిచెప్పారు శ్రీవాస్తవ. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​, అరుణాచల్​ ప్రదేశ్​లు తమ దేశ భూభాగంలోనివేనని పునరుద్ఘాటించారు. సరిహద్దు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- యుద్ధానికి సన్నద్ధం కండి-సైనిక దళాలకు జిన్​పింగ్​ పిలుపు!

Last Updated :Oct 15, 2020, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.