ETV Bharat / bharat

'ఉగ్రవాదుల ఏరివేతలో సైన్యం రికార్డులు'

author img

By

Published : Oct 12, 2020, 3:22 PM IST

సరిహద్దులో ఉగ్రవాదులపై భారత సైన్యం విరుచుకుపడుతోంది. గత 5 రోజుల్లో 10మంది ముష్కరులను మట్టుబెట్టింది. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటివరకు 180మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చినట్టు జమ్ముకశ్మీర్​ డీజీపీ వెల్లడించారు. మరోవైపు శ్రీనగర్​లో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. వీరిలో ఒక లష్కరే తోయిబా కమాండర్​ అని అధికారులు తెలిపారు.

10 terrorists killed in 4 operations in last 5 days: D Singh, DGP, J&K
ఉగ్రవాదుల ఏరివేతలో బిజీ బిజీగా సైన్యం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యం బిజీబిజీగా గడుపుతోంది. గడిచిన 5 రోజుల్లో 4 ఆపరేషన్లు జరపగా.. 10మంది ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఒక ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. ఈ వివరాలను జమ్ముకశ్మీర్​ డీజీపీ డీ సింగ్​ వెల్లడించారు.

ఈ ఏడాది మొత్తం మీద 75 ఆపరేషన్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు డీ సింగ్​. 180మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చిందని స్పష్టం చేశారు. 138 ముష్కరులతో పాటు వారికి సంబంధం ఉన్న వారిని కూడా అరెస్టు చేసినట్టు వివరించారు. ఇవన్నీ రికార్డులని వెల్లడించారు.

శ్రీనగర్​ ఎన్​కౌంటర్​...

శ్రీనగర్​లోని పాత బార్జుల్లా ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మిలిటెంట్లను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో ఒకడు లష్కరే తోయీబా ఉగ్రసంస్థకు చెందిన కమాండర్​ సైఫుల్లా​ అని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్​కు చెందిన సైఫుల్లాకు ఇప్పటివరకు మూడు ఉగ్రదాడుల్లో ముగ్గురు సీఆర్​పీఎఫ్​ జవాన్లను బలిగొన్నట్టు వివరించారు.

ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా బలగాలు. జవాన్లు చూసిన అనంతరం వారిపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఇదీ చూడండి:- మంచి చెప్పినా వినని ముగ్గురు ముష్కరులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.