అన్నా హజారేకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

author img

By

Published : Nov 25, 2021, 6:22 PM IST

Updated : Nov 25, 2021, 7:31 PM IST

Anna Hazare

Anna Hazare News: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆసుపత్రిపాలయ్యారు. తీవ్రమైన ఛాతి నొప్పితో పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేరారు.

Anna Hazare News: తీవ్రమైన ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరారు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే. మహారాష్ట్ర పుణెలోని రూబీ హాస్పిటల్​లో ఆయన చికిత్స పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

గుండెలోని ఓ వైపు ధమనిలో ఏర్పడిన చిన్నఅడ్డంకిని శస్త్రచికిత్స చేసి తొలగించినట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హజారే ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు.

మూడు రోజుల నుంచి ఛాతిలో నొప్పి ఉందని అన్నా హజారే ఆసుపత్రిలో చేరారు. నిపుణుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించింది. ధమనుల్లో ఏర్పడిన చిన్న అడ్డంకి కారణంగా నొప్పి వచ్చినట్లు ఈసీజీ లో తేలింది.

- ఆసుపత్రి వర్గాలు

మరో రెండు మూడు రోజుల్లో హజారే డిశ్ఛార్జి అవుతారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: ఏడు దశాబ్దాల తర్వాత యూపీ కలలు సాకారం: మోదీ

Last Updated :Nov 25, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.