దిల్లీ పోలీసులపై కరోనా పంజా- ఒకేసారి 1000 మందికి వైరస్

author img

By

Published : Jan 10, 2022, 2:28 PM IST

Updated : Jan 10, 2022, 3:14 PM IST

Delhi Police Corona

Delhi Police Corona: దిల్లీలో 1000 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరిలో కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వైరస్ బాధితులంతా ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నట్లు దిల్లీ పోలీస్ యంత్రాంగం తెలిపింది.

Delhi Police Corona: కరోనా అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతోంది. దిల్లీలో తాజాగా దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, దిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్​ బిశ్వాల్​ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్​లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

దిల్లీలో కొవిడ్​-19 వ్యాప్తి దృష్ట్యా.. దిల్లీ పోలీస్ కమిషనర్​ రాకేశ్ అస్తానా.. ఇదివరకే పోలీస్​ సిబ్బందికి పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. పోలీస్ సిబ్బంది ఫ్రంట్​లైన్​ వారియర్స్​లో భాగం కాబట్టి వైరస్ బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అందులో ఉంది.

పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలి, శానిటైజర్లు వాడాలని నిబంధనల్లో ఉంది. పోలీస్​ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధనల్లో సూచించారు.

దిల్లీలో మొత్తం 80వేలకుపైగా పోలీస్​ సిబ్బంది ఉన్నారు.

పుణెలో 200 మందికి వైరస్..

Pune Police Covid-19: మరోవైపు మహారాష్ట్రలోని పుణెలో వారంరోజుల వ్యవధిలోనే 232 మంది పోలీసులు కొవిడ్​ బారిన పడ్డారు. అయితే ఇద్దరు పోలీసులు మాత్రమే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగతావాళ్లు హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

2020 మార్చిలో వైరస్ ప్రబలిన సమయం నుంచి పుణెలో మొత్తం 2,670 మంది పోలీస్ సిబ్బంది కొవిడ్ బారిన పడ్డారు.

పుణెలో తాజాగా 6,464 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 19శాతంగా ఉంది. వైరస్​ కట్టడి చర్యల్లో భాగంగా నగరంలో రాత్రి 11 నుంచి ఉదయం 5గంటల వరకు రాత్రి కర్ప్యూ విధించారు.

ఇదీ చూడండి: ముగ్గురు బాలికలపై రేప్​​.. తెలిసినవారేనని నమ్మి వెళ్తే...

Last Updated :Jan 10, 2022, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.