వేగంగా వచ్చి ఢీ కొట్టిన కారు.. ఐదడుగుల దూరంలో ఎగిరిపడిన యువకుడు

By

Published : Sep 21, 2022, 12:48 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​లోని రుద్రపూర్​లో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రపూర్​ కిచ్చాలో జాతీయ రహదారిని దాటుతున్న ఓ యువకుడిని అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. కారు వేగంగా ఢీకొనడం వల్ల ఆ యువకుడు ఐదు అడుగుల దూరంలో ఎగిరి పడ్డాడు. ఘటన జరిగిన తర్వాత కారు డ్రైవర్​ అక్కడి నుంచి పరారయ్యాడు. అటుగా వెళ్తున్న ఓ జవాన్..​ యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తిని బరేలీకి చెందిన గోపాల్​ ప్రజాపతిగా గుర్తించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.