లాకప్​లో ఖైదీ మృతి.. లైవ్​లో కుప్పకూలిన స్మగ్లర్.. స్టేషన్​పై గ్రామస్థుల దాడి

By

Published : Sep 21, 2022, 8:25 PM IST

thumbnail

లాకప్​లో ఉన్న అక్రమ మద్యం స్మగ్లింగ్​ కేసు నిందితుడు అనుమానాస్పద మృతికి సంబంధించిన వీడియో బిహార్​లోని కాటిహార్​ జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రాణ్​పుర్​ స్టేషన్​లోని లాకప్​లో ఉన్న ప్రమోద్.. మరో వ్యక్తితో మాట్లాడుతూ అకస్మాత్తుగా మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన గ్రామస్థులు.. పోలీస్​స్టేషన్​పైకి దాడికి దిగారు. ఈ ఘటనలో పది మంది పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు చేపట్టామని కాటిహార్​ ఎస్​ఐ జితేంద్ర తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.