ఘనంగా శునకం బర్త్​డే సెలబ్రేషన్స్​.. కేక్ కటింగ్​.. అందరికీ స్పెషల్​ డిన్నర్​!

By

Published : Sep 17, 2022, 3:56 PM IST

thumbnail

Dog Birthday Celebrations: పెంపుడు కుక్కలపై యజమానులకు ప్రేమ సహజమే. వాటిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మిర్జాపుర్​ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. జిల్లాలోని బన్వారిపుర్​లో నివాసం ఉంటున్న సురేశ్​ కుమార్ బింద్​.. తన పెంపుడు కుక్క రాణి ఐదో పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా జరిపాడు. శునకంతో కేక్​ కట్​ చేయించి.. స్థానికులు, బంధుమిత్రులకు స్పెషల్​ డిన్నర్​ ఏర్పాటు చేశాడు. బర్త్​డే పార్టీకి వచ్చిన చిన్నారులంతా డీజే పాటలకు డ్యాన్స్​లు చేసి అలరించారు. ప్రస్తుతం ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో రాణి బర్త్​డే సెలబ్రేషన్స్​ హాట్ టాపిక్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.