Pratidwani: మహిళల శరీరంపై ఎందుకింత నిఘా..సీక్రెట్ కెమెరాల అసహ్య వేటను ఆపేదెలా ?
ఫుడ్‌కోర్టు, రెస్టారెంట్, హోటల్, హాస్టల్.. ఎక్కడా మహిళల మర్యాదకు కనీస భద్రతలేదు. వాష్‌రూం, బాత్రూం, టాయిలెట్, వరండా.. ఎక్కడ సీక్రెట్ కెమెరాలు మహిళల్ని రహస్యంగా వీడియోలు తేస్తున్నాయో చెప్పడం ఇప్పుడు కష్టం. మహిళ అడుగుతీసి అడుగువేస్తే చాలు...ఆమె కదలికల్ని సీక్రెట్‌గా రికార్డు చేస్తున్నారు...అశ్లీల కంటెంట్ అన్వేషకులు. ఇంట్లోంచి సురక్షితంగా కాలు బయట పెట్టిన మహిళ అంతే గౌరవంగా తిరిగి ఇంటికి చేరుకోలేని దురవస్థ నేడు సమాజాన్ని పట్టి పీడిస్తోంది. మహిళల శరీరంపై ఎందుకింత నిఘా...? ఆమె వ్యక్తిగత జీవితం ఇంటర్నెట్లో జుగుప్సాకర దృశ్యంగా ఎందుకు మారుతోంది ? సీక్రెట్ కెమెరాల అసహ్య వేటను ఆపేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.