Prathidwani: రాజకీయాల్లో నేరచరితుల ఏరివేత ఎప్పటికి?

By

Published : Jan 19, 2022, 9:24 PM IST

thumbnail

నేరాల నల్లమరకల్ని తెల్లచొక్కాల మాటున దాచేసి.... దర్జాగా ద‌ర్పం వెలగబెడుతున్నారు.. కళంకిత నేతాశ్రీలు. ఒకరో... ఇద్దరో కాదు... వందలు దాటిన ఆ సంఖ్య... వేల వైపు పరుగులు పెడుతోంది. నేర రాజకీయాలు ప్రజాస్వామ్య పునాదులనే చెదలు పట్టేలా చేస్తున్నాయి. ఇదే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో... ఇప్పుడు ఒక కీలక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో... పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర వెల్లడించాల్సిందే.. రాజకీయ పార్టీలు కూడా వారి ఎంపికకు కారణాలు తప్పక చెప్పాలన్నదే ఈ పిల్ సారాంశం. అసలు... నేర రాజకీయాల ప్రక్షాళనపై గతంలో ఇచ్చిన తీర్పులు... ఎన్నికలసంఘం సంస్కరణల అమలు ఎలా ఉంది...? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.