కరోనా సెగ.. హోటల్​ గదిలోనే స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ ప్రాక్టీస్​

By

Published : Jan 20, 2021, 11:04 AM IST

thumbnail

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ఇప్పటికీ పది కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వడం వల్ల 72 మంది ఆటగాళ్లు కఠిన క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. వీరందరూ తమ గదులను దాటి బయటకు వచ్చి ప్రాక్టీస్​ చేయడానికి అనుమతి లేదు. దీంతో గదులకే పరిమితమైన వీరు భిన్నమైన రీతిలో తమ ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికన్​ ప్లేయర్​ కోకో గాఫ్​.. తన హోటల్​ గదిలోనే సాధన చేస్తుంది. బంతులను గోడకు కొడుతూ సన్నద్ధం అవుతోంది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.