ప్రభుత్వ మద్యం దుకాణంలో కత్తులు దూసిన యువకులు - ఆస్పత్రిలో ఇద్దరు
Young Men Attack Each Other : ఇద్దరు యువకులు మద్యం దుకాణం వద్ద ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేస్తుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుల వివరాల్లోకి వెళ్లితే.. ఉరవకొండ పట్టణంలోని డ్త్రెవర్స్ కాలనీలో శ్రీకాంత్, శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మొదట వాదులాటకు దిగారు. క్రమంగా ఈ వాదులాట పెద్దదై కత్తులతో దాడి చేసుకోవడం వరకు వచ్చింది. ఈ దాడిలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో గాయపడిన వీరిని.. ప్రధమ చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అనంతరం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని యువకుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘర్షణకు పాత కక్షలే కారణమని తెలుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ మద్య దుకాణం ప్రధాన రహదారికి సమీపంలో ఉన్నందున.. వివిధ కాలనీలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.