YCP leader cheated woman: ఉద్యోగం పేరిట మోసం.. అడిగితే వైసీపీ నాయకుడి బెదిరింపులు
Published: May 17, 2023, 9:12 PM

YCP leader cheated on a woman: అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానంటూ వైసీపీ నాయకుడు డబ్బు తీసుకొని మోసం చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని చిలమత్తూరు మండలానికి చెందిన వైసీపీ నాయకుడు సురేష్ రెడ్డి అదే మండలానికి చెందిన కొత్త చమలపల్లికి చెందిన అనిత, వెంకటేష్ అనే దంపతులకు అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి లక్షా యాభై వేల రూపాయలు నగదు రూపంలో తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో ఆ దంపతులు మోసపోయామని గ్రహించి.. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమనగా.. వైసీపీ నాయకుడు ఇచ్చేది లేదని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ.. తమను వేధిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఇంక ఆ బాధిత దంపతులు చేసేది ఏమీ లేక 'జగనన్నకు చెబుదాం'కు ఫిర్యాదు చేశారు. అనంతరం చిలమత్తూరు మండల పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి తమకు న్యాయం జరిగేలా చూసి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధిత దంపతులు వేడుకుంటున్నారు.