విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి సాఫ్ట్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి: భాషావేత్త డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్
Workshop on Empowering Students through Life Skills: విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు భయాన్ని పోగొట్టడంలో సాఫ్ట్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయని భాషావేత్త, సెంటర్ ఫర్ ఎమోషనల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ అన్నారు. విశాఖలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఆధ్వర్యంలో "లైఫ్ స్కిల్స్ ద్వారా విద్యార్థులను సాధికారత పరచడం" అనే అంశంపై నాలుగు రోజుల వర్క్‌షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డొమైన్ జ్ఞానాన్ని బుద్ధిపూర్వకంగా సంపాదించడానికి.. విద్యార్థులకు సామర్థ్యంతో కూడిన నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి కమ్యూనికేషన్ అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిషేక్ అన్నారు. విద్యార్థులు తమ జీవితంలో విద్య, వృత్తి, స్మార్ట్ గోల్ సెట్టింగ్, ఎఫెక్టివ్ పర్పస్ ఓరియెంటెడ్ మేనేజ్‌మెంట్ కోసం నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ షైజీ, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి హేమ, డాక్టర్ ఓ అరుణాదేవి, డాక్టర్ పీకే జయలక్ష్మి, వీణ పాల్గొన్నారు.