ఆఫీస్‌లో పని ఉందని పిలిచి - కడపలో వాలంటీర్ దారుణ హత్య
Volunteer Murdered In Kadapa: కడపలో వాలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. భవాని శంకర్‌ను స్నేహితుడే అతి కిరాతకంగా కత్తితో నరికి హత్య చేశాడు. నిరంజన్‌నగర్‌కు చెందిన భవానీ శంకర్ అనే వ్యక్తి.. 14వ డివిజన్ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా జీవిత బీమా కార్యాలయంలో పొరుగు సేవల సిబ్బందిగా డిజిటలైజేషన్ పనులు కూడా చేస్తున్నాడు. ఆయనతోపాటు మల్లికార్జున్ అనే వ్యక్తి కూడా అక్కడే పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి.
భవాని శంకర్ హత్యకు ముందుగానే మల్లికార్జున్ ప్రణాళిక రచించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మల్లికార్జున్ ఆదివారం ఉదయం భవానీ శంకర్‌కు ఫోన్ చేసి.. జీవిత బీమా కార్యాలయంలో పని ఉందని పిలిచాడు. దీంతో భవానీ శంకర్ కార్యాలయానికి వెళ్లాడు. భవానీ శంకర్ కార్యాలయానికి రాగానే కత్తితో దాడి చేసి హత్య చేశాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు.