రాష్ట్ర భవిష్యత్ కోసం వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి : ఆలపాటి
Telugu Desam and Janasena in Spirit Meeting : రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని.. ఆ పార్టీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నాేదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న నిర్ణయాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పార్టీ కార్యకర్తలను కోరారు. గుంటూరు జిల్లా తెనాలిలో.. తెలుగుదేశం, జనసేన ఆత్మీయ సమావేశాల్లో రాజేంద్రప్రసాద్, మనోహర్ పాల్గొన్నారు. ఇరు పార్టీల పెద్దలు తీసుకున్న నిర్ణయాల అనుగుణంగా కార్యకర్తలు నడుచుకోవాలని సూచనలు చేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రాస్థాయి వరకు కూకటివేళ్లతో పెకలించే విధంగా కృషి చేయాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరూ అభిప్రాయ భేదాలు లేకుండా కలిసి పనిచేయలన్నారు. ఇరు పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో ప్రజల ముందుకు వెళ్లితే.. వారు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, గౌరవిస్తారని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఏ కార్యక్రమం చేసిన కలిసే చేద్దామని పార్టీల పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో జనసేన పాల్గొంటుందని తెలిపారు.