TDP Chief Chandrababu Relative Interview: 'నా ఉద్యోగం పోయినా పర్వాలేదు..చంద్రబాబు విడుదలయ్యేవరకు ఇక్కడే ఉంటా'
TDP Chief Chandrababu Relative Interview: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిసి.. తాను అమెరికాలోని డల్లాస్ నుంచి రాజమహేంద్రవరం వచ్చానని చంద్రబాబు సమీప బంధువు ప్రతాప్ తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే వరకు తాను ఇక్కడే ఉంటానన్నారు. ఆయనకు నిరంతరం ప్రజల కోసమే పని చేయడం తప్ప.. అవినీతి చేయడం తేలియదన్నారు.
Pratap Comments: చంద్రబాబు బంధువు ప్రతాప్ ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ.. ''చంద్రబాబు కర్మయోగి. ఆయన ప్రజల కోసం నిరంతరంగా పని చేస్తూనే ఉన్నారు. అటువంటి ఆయనను అక్రమంగా అరెస్టు చేయడం దారుణం. నా చదువుకు చంద్రబాబు సాయం అందించారు. ఇప్పుడు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాను. చంద్రబాబు అరెస్ట్ అయ్యారని తెలిసి.. అమెరికాలోని డల్లాస్ నుంచి వచ్చాను. నా జాబ్ పోయినా పర్వాలేదు. చంద్రబాబు విడుదలయ్యేవరకు ఇక్కడే ఉంటాను. చిన్నప్పటి నుంచి ఆయన సొంత గ్రామమైన నారావారిపల్లెలోనే పెరిగాను. ఆయన (చంద్రబాబు) తప్పుచేయరు'' అని ఆయన అన్నారు.