'స్వామియే శరణం అయ్యప్ప - వరల్డ్ కప్ భారం నీదేనయ్యా'!
Special Pooja For Indias Victory: విజయనగరం జిల్లా రాజాం మండలం గడ్డ వలస గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములు.. క్రికెట్ వరల్డ్ కప్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఇండియా క్రికెట్ ఆటగాళ్ల ఫొటోలతో ఇష్ట దైవమైన అయ్యప్ప స్వామికి 18 మెట్లతో గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో గురుస్వాములు, స్వాములు పూజలు చేపట్టి.. భజన నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలని అయ్యప్ప స్వామిని కోరుకున్నారు. 'భారత్‌మాతాకీ జై', 'ఆల్ ద బెస్ట్ ఇండియా' అంటూ నినదించారు.
Pooja on Cricket World Cup: వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఇండియా గెలుపొందాలని కోరుతూ.. బాపట్లజిల్లా చీరాలలో క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు.. పేరాలలోని పుణుగు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో క్రికెట్ అభిమానులు శివయ్యకు అభిషేకం చేసి కొబ్బరికాయలు కొట్టారు. "ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా" అంటూ క్రికెట్ అభిమానులు నినాదాలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానున్న ప్రపంచ క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను తిలకించేందుకు చీరాల మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో పెద్ద ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశారు.