Shirdi Saibaba Sansthan Trust రెండు వేల రూపాయల నోట్లను.. విరాళంగా ఇవ్వచ్చు :షిర్డీ సాయిబాబా సంస్థాన్
Published: May 20, 2023, 8:00 PM

Shirdi Saibaba Sansthan Trust about 2000 Notes: షిర్డీ సాయిబాబా దర్శనానికి వచ్చే భక్తులు సెప్టెంబరు 30లోగా.. సాయిబాబా విరాళాల పెట్టెలో రెండు వేల రూపాయల నోట్లను వేయవచ్చని సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీ శివశంకర్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల నోటును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో షిర్డీ సాయిబాబా సంస్థాన్ కూడా అప్రమత్తమైంది. సాయిబాబా దర్శనానికి వచ్చే భక్తులు సెప్టెంబర్ 30లోగా రెండు వేల రూపాయల నోట్లను విరాళాల పెట్టెలో జమ చేయాలని.. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీ శివశంకర్ కోరారు. సాయిబాబా సంస్థానానికి విరాళాల లెక్కింపు ప్రతి మంగళవారం, శుక్రవారం జరుగుతుంది. ఈ మొత్తాన్ని వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. దీంతో రెండు వేల నోట్లు వెంటనే బ్యాంకుకు వెళ్తాయని తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్ 30 తర్వాత భక్తులు రూ.2000 నోట్లను సాయి సంస్థాన్ విరాళాల పెట్టెలో వేయవద్దని పీ శివశంకర్ కోరారు.