Sankatahara Chaturthi Celebrations at Varasiddhi Vinayaka Temple in Kanipakam : కాణిపాకంలో ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు
Sankatahara Chaturthi Celebrations at Varasiddhi Vinayaka Temple in Kanipakam : కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. వరసిద్ధి వినాయకునికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథోత్సవ వేడుకల్లో వరసిద్ధి వినాయకుడు సిద్ధిబుద్ధి సమేతుడై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంలో ఊరేగుతున్న స్వామిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు సిద్ధివినాయకుడు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం . ఈ సందర్భంగా స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంకటహర చతుర్థి వేడుకల్లో , స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సత్యన్నారాయణ, శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం చైర్మన్ మోహన్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్ పాల్గొన్నారు. సంకటహర చతుర్థి సందర్భంగా భక్తులు సిద్ధివినాయకున్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు.