తెనాలిలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి - పలువురికి గాయాలు
Road Accidents Several Dead: గుంటూరు జిల్లా తెనాలిలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. భట్టిప్రోలుకు చెందిన అభి, కిషోర్, ప్రేమ్ కుమార్ తెనాలి నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనటం(Bike Lost Control and Hit Divider)తో.. అభి, కిషోర్ ఘటన స్థలంలోనే మృతి చెందగా ప్రేమ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. గాయాలపాలైన ప్రేమ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.
Two bikes Collided: అలాగే తెనాలిలోని కంచర్లపాలెంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి మృతి చెందాడు. బజాజ్, యాక్టివా వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో యాక్టివా పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎదురు వచ్చిన వాహనంపై నందివెలుగు గ్రామానికి చెందిన బాబి, బోల్ల నరేష్‌లకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు.