వైసీపీ ప్రభుత్వంలో దళితులకు బతికే హక్కు లేదా జగనన్నా!
Prathidwani Debate on Attacks on Dalits in YSP Govt: రాష్ట్రవ్యాప్తంగా దళిత సమాజం ముఖ్యమంత్రి జగన్‌కు సంధిస్తోన్న ప్రశ్న ఇది. కంచికచర్లలో దళిత యువకుడిని చావబాది నోట్లో మూత్రం పోసిన ఘటన మరిచిపోక ముందే ఉలిక్కిపడేలా చేసింది దొమ్మేరులో దళిత యువకుడి ఆత్మహత్య. ఇవి రెండే కాదు.. వైసీపీ నాలుగున్నరేళ్ల ఏలుబడిలో దళితులకు బతికే హక్కుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారిందని వాపోతున్నాయి దళిత సంఘాలు. దొమ్మేరులో అసలేం జరిగింది? అదో చిన్న గొడవే అంటున్న పోలీసులు.. అసలు ఒక చిన్న ఫ్లెక్సీ వివాదంలో ఎందుకు జోక్యం చేసుకున్నారు? మహేంద్ర మరణానికి ఎవరు బాధ్యులు? స్వయాన రాష్ట్ర హోమంత్రి ఇలాఖాలో చోటు చేసుకున్న.. ఈ విషాదం దళితుల స్థితిగతులపై ఏం చెబుతోంది? వైసీపీ 52 నెలల పాలనలో దళితులపై దాడులు, అఘాయిత్యాలకు లెక్కేలేదు. అందులోనూ ఉమ్మడి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దానికి కారణం? ఒకవైపేమో సీఎం జగన్ SC, STలపై దాడుల్ని ఉపేక్షించేది లేదంటారు. మాటకు ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలంటారు. కానీ స్వయాన హోమంత్రి ఇలాకాలో ఈ దుస్థితి ఏం చెబుతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.