Prathidwani: అంగన్‌వాడీల సమస్యలేంటి ? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలేంటి ?
Prathidwani: హామీల అమల సాధన కోసం మరో సారి సమ్మెబాటకు సిద్ధమయ్యారు అంగన్‌వాడీ వర్కర్లు. అన్నగా, అండగా ఉంటానంటూ జగన్ తమకు ఇచ్చిన మాట మేరకు ఉద్యోగ భద్రత.. కనీస వేతనం పెంపు, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలూ అందించాలని డిమాండ్‌లతో సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. ఎప్పటి నుంచో ఉన్న తమ విన్నపాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక పోవడానికి తోడు.. కొంతకాలంగా పెరిగిన పని ఒత్తిళ్లు, వేధింపులకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం అని ప్రకటించారు. అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది ? అంగన్‌వాడీల సమస్యలేంటి ? వారికి జగన్ ఏం హామీలిచ్చారు ? ఇవాళ రాష్ట్రంలో అంగన్‌వాడీలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఏపీ అంగన్‌వాడీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ, ఏపీ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.