మహిళలపై దాడుల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది?
Prathidhwani: రాష్ట్రంలో మహిళలపై దాడుల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఒకవైపు ఏ ఒక్క ఆడపిల్లకు కష్టం వచ్చినా గన్ కన్నా ముందు జగన్ వచ్చి శిక్షిస్తాడని అంటారు. మరోవైపు మహిళలపై అదే వైసీపీ నేతలు, వారి అనుచరుల దౌర్జన్యాలు, దాష్టీకాలకు అడ్డు అదుపు ఉండదు. కొద్దిరోజులుగా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు, ప్రజాసంఘాలు. అయినా మహిళలు, ఆడపిల్లలపై దాడులు ఆగిందే లేదు. ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న దిశాచట్టం, దిశా యాప్ బాధితులకు ఎంత వరకు అక్కరకు వస్తున్నాయో, అండగా నిలుస్తున్నాయో వరస ఉదంతాలే చెబుతున్నాయి. అసలు ఎందుకీ దుస్థితి? అబలల భద్రతకు భరోసా ఎలా..? కేంద్రం ఆమోదం తెలపకున్నా దిశాచట్టంపై విస్తృత ప్రచారం చేసుకుంటోంది జగన్ సర్కార్. మరి ఆ భయాన్ని మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎందుకు కల్పించలేక పోతోంది? మహిళలపై అమానుష దాడులకు పాల్పడుతున్న వారిలో... అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వారిపై వైసీపీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటోందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.