పోలీసుల అత్యుత్సాహం, కారణం లేకుండానే టీడీపీ నేత అరెస్టుకు యత్నం - కార్యకర్తలు నిలదీయడంతో వెనకడుగు
Police Overaction on TDP Leader Lakshminarayana in Gurjala: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా నడుచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నాయకులు ఎన్ని అక్రమాలు చేసినా వాటిని పట్టించుకోకపోవడం వాటిపై ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. సామాన్యులపై రౌడీల కంటే దారుణంగా దాడులకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు టీడీపీ నేతపై అత్యుత్సాహం ప్రదర్శించారు. కారణం లేకుండానే తెలుగుదేశం మండల కన్వీనర్ లక్ష్మీనారాయణను అరెస్టు చేసేందుకు యత్నించారు. తనపై ఏం కేసుల ఉన్నాయి..? ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారో చెప్పాలని లక్ష్మీనారాయణ గట్టిగా నిలదీశారు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఎదురుతిరగడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఎందుకు, ఏమిటని కారణం అడిగినా వారు తెలియజేయకపోవడంతో ఒక్కసారిగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులకు అడ్డంగా నిలిచారు. చివరకు గురజాల సీఐ రమ్మంటున్నారంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.