మూడు జిల్లాల్లో ముప్పు తిప్పలు పెడుతున్న గజదొంగ అరెస్టు!
Police Arrested Thief Committing Thefts in Houses: అతనో పెద్ద గజదొంగ.. 6 జిల్లాల్లోని పలు పోలీస్టేషన్లలో అతనిపై అనేక కేసులు నమోదైన.. అతను ఇంత వరకు పోలీసులకు పట్టుబడనే లేదు.. ఏవడికైనా టైం వస్తే గాని పాపం పండదు. ఎట్టకేలకు ఇప్పుడా గజదొంగ ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఆ అంతర్ జిల్లా గజ దొంగని తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజదొంగ నుంచి భారీ మొత్తంలో 23 లక్షల 80 వేల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. తణుకుకి చెందిన ఈ గజదొంగ నవీన్ ప్రసాద్.. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు రకాల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతను ఇప్పటి వరకు 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని.. తొలిసారిగా అతడ్ని పట్టుకున్నామని ఎస్పీ జగదీష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డు అందించారు.