బెంజ్ సర్కిల్లో మహిళల కోసం పింక్ టాయిలెట్
Pink toilet for Women Pink toilet for Women : విజయవాడ నగర పాలక సంస్థ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 20 లక్షల రూపాయలతో బెంజ్ సర్కిల్లో మహిళల కోసం పింక్ టాయిలెట్‌ను అందుబాటులో తెచ్చింది. నగరంలో ప్రధాన కూడళ్లలో మరిన్ని పింక్ టాయిలెట్లును నిర్మించి మహిళలకు అందుబాటులోకి తెస్తామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. నగరంలో మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని పింక్ టాయిలెట్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా.. మహిళల నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి, చిన్నపిల్లలకు పాలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ అంతా మహిళా సిబ్బంది మాత్రమే పనిచేస్తారని వెల్లడించారు. పింక్ టాయిలెట్లకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్‌ల్లో పింక్ టాయిలెట్‌ను నిర్మించడం వల్ల మహిళలకు, కాలేజి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతుందని పేర్కొన్నారు.