ఇంటింటా మొక్కలు నాటాలి : పరిటాల శ్రీరామ్
Paritala Sriram Initiated the Program of Planting Ten Thousand Sapling : పదివేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో ఉన్న పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఈ కార్యక్రమానికి వేదిక అయ్యింది. తెలుగుదేశం పార్టీ తరుపున ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిటాల శ్రీరామ్.. ఇటీవల తాడిమర్రి మండలంలో చిని చెట్ల నరికివేత ఘటనలు వరుసగా జరిగినందుకు ఈ కార్యక్రమానికి నాంది పలికారు.
చెట్లను నరకడం పర్యావరణానికి హానికరం అని తెలియజేస్తూ.. ఇంటింటా మొక్కలు నాటాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాడిమర్రి మండలంలోని కాట కోటేశ్వర స్వామి ఆలయంలో పరిటాల స్వయంగా మొక్కను నాటి, నీరు పోసి స్థానిక ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొక్కలను నాటి ప్రకృతిని కాపాడుకుందామని ఈ నేపధ్యంలో ప్రజలకు తెలియజేశారు.