'చిన్నారి ప్రపంచం' - విద్యార్థుల చిత్రప్రదర్శన అదుర్స్
Paradise Art Exhibition On Students In Vijayawada: విజయవాడ బాలోత్సవ భవన్లో నిర్వహించిన చిత్రప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్స్(Forum For Artists), గుర్రం జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో స్ఫూర్తి, ఆర్ట్ మేట్, చిత్రం ఆర్టిస్ట్ స్కూల్స్ కు చెందిన 40మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శనలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్, బీసెంట్ రోడ్డు, కర్నూలు కొండారెడ్డి బురుజు చిత్రాలు ప్రత్యేకంగా నిలిచాయి.
చిత్రకళారంగంలో నూతన మార్పులు సెల్ ఫోన్లు, టీవీలతో మానసిక సామర్థ్యం కోల్పోతున్న పిల్లల మేదస్సులో మంచి భావాలను పెంపొందించేందుకు మా వంతు కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కళాత్మక దృష్టితో చూడాలేగానీ.. ప్రతి బొమ్మలోను ఓ కథ కనిపిస్తుందని అన్నారు. భాష కన్నా ముందు పుట్టిందే భావమని బొమ్మలు మాట్లాడతాయని తెలిపారు. పిల్లలు చిత్రకారులుగా మారితే భవిష్యత్తులో అందమైన ప్రపంచం ఏర్పడుతుందని వారు ఆకాంక్షించారు. చిన్నతనంలో డ్రాయింగ్ నేర్పించే గురువులు పాఠశాలలో ఉండేవారని, ఇప్పటి పరిస్థితుల్లో అది కరవైందన్నారు.