కడపలో 24 గంటల్లో మరో హత్య - తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని కత్తితో
Murder in Kadapa: కడపలో 24 గంటల్లో మరో హత్య జరిగింది. కడప జీవిత భీమా కార్యాలయంలో వార్డు వాలంటరీ భవాని శంకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అర్ధరాత్రి కడప పాత బైపాస్ వద్ద సాయికిరణ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రపురానికి చెందిన సాయికిరణ్ కడపలోని ప్రైవేట్ షోరూంలో పనిచేస్తున్నారు.
Stabbed to Death: సాయికిరణ్, మహేశ్‌కు 50 వేల రూపాయలు బాకీ ఉన్నాడు. నగదు విషయమై సాయికిరణ్, మహేశ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేశ్ కత్తితో సాయికిరణ్‌పై దాడి(Knife Attack) చేశారు. మహేశ్ వెంటనే సాయికిరణ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన అనంతరం మహేశ్ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసుల అధికారులకు లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.