విజయనగరంలో దారుణ హత్యకు గురైన వాచ్మెన్
Murder Case in Vijayanagaram District: విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో రాత్రి కాపాలదారుగా పని చేస్తున్న అప్పలనాయుడు... అదే కంపెనీలో పనిచేస్తున్న కొనాల్ అనే ఉద్యోగి చేతిలో హత్యకు గురయ్యాడు.
Watchman Killed by Konal Who Was Working in Same Company: లోనివీటి అగ్రహారం 35వ డివిజన్ పరిధిలో ఇండస్ట్రియల్ ఏరియాలోని బంటుపల్లి అప్పలనాయుడు (71) స్థానిక ప్లాస్టిక్ కంపెనీలో గత కొంతకాలంగా వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం యధావిధిగా అప్పల నాయుడు తన విదుల్లో హజరయ్యాడు. అదే కంపెనీలో బీహార్ ప్రాంతానికి చెందిన కొనాల్(35) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. రాత్రి 9:30 గంటలకు మిషన్ కు ఉన్న కటింగ్ బ్లేడ్లు అమ్ముకోవడానికి కొనాల్ బయటకు పట్టుకుని వెళ్తుంటే వాచ్మెన్ అప్పలనాయుడు అడ్డుకున్నాడు. దీంతో కొనాల్ ఆవేశంతో అప్పల నాయుడుపై దాడి చేశాడు. చేతిలో ఉన్న పరికరంతో కడుపులో పొడవగా అప్పలనాయుడు గాయపడ్డారు. స్థానికులు, పక్క ఫ్యాక్టరీలోని వారు విషయం తెలుసుకుని బాధితునికి ప్రథమ చికిత్స చేశారు.అనంతరం అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులతో ఇంటికి చేరిన అప్పలనాయుడు ఉదయానికి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు.అప్పలనాయుడు హత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.