Moda Kondamma Jatara Ended: వైభవంగా ముగిసిన మోదకొండమ్మ గిరిజన మహోత్సవాలు
Moda Kondamma Jatara Ended In Paderu : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మోదకొండమ్మ గిరిజన మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 14 ప్రారంభమైన రాష్ట్ర గిరిజన జాతర మోదకొండమ్మ మహోత్సవాలు 3 రోజుల పాటు భక్తుల నడుమ అంగరంగ వైభవంగా సాగాయి. అమ్మవారి అనుపోత్సవం కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అవినాశ్ అనుపోత్సవంలో పాల్గొన్నారు.
పాడేరు మెయిన్ రోడ్లో ఉన్న శతకం పట్టు వద్ద విగ్రహాలను భారీ ఊరేగింపుగా పురవీధుల్లో నృత్యాలు చేస్తూ తీసుకు వెళ్లారు. అంగరంగ వైభవంగా గరగ నృత్యం, పులి వేషాలు, కోయ డాన్సులు, తప్పెట గుళ్ల మధ్య ఈ ర్యాలీ సాగింది. భక్తులు అమ్మవారి విగ్రహాలను శిరస్సుపై ఉంచుకునేందుకు, ఆశీస్సులు పొందేందుకు పోటీ పడ్డారు. 100 అడుగుల దూరం క్యూ కట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ర్యాలీ సాగింది. ఒడియా బృందం ప్రదర్శించిన కట్టప్ప వేషధారణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.