MLA Anam Ramanarayana Reddy Stopped YSRCP Leaders Secret Meeting With Volunteers: వాలంటీర్లతో వైసీపీ నేతల రహస్య సమావేశం.. అడ్డుకున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
MLA Anam Ramanarayana Reddy Stopped YSRCP Leaders Secret Meeting With Volunteers: వైసీపీ నేతలు వాలంటీర్లను వాడుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే విక్రం రెడ్డి అనుచరులు వాలంటీర్లు, అధికారులతో కలిసి రహస్య సమావేశం నిర్వహించగా.. ఆనం వారిని పట్టుకున్నారు. సెలవు రోజుల్లో వాలంటీర్లు, అధికారులతో సమావేశం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా సంగంలోని సహకార పరపతి బ్యాంకు ఆవరణలో బుధవారం.. ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి అనుచరులు అధికారులు, వాలంటీర్లతో రహస్యంగా సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఆనం రాకను గమనించి కొందరు అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. మరికొంత మంది బాత్రూముల్లోకి వెళ్లి దాక్కున్నారు. స్థానిక వైసీపీ నేతలు ఆనం రాకను గుర్తించి పరుగులు తీశారు. పథకం ప్రకారమే టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను గమనించినట్లు.. గత మూడు రోజులుగా 3రోజులుగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.