చరిత్రకారులు విస్మరించిన వీరవనితలు - ఈ 'మిణుగురులు'
Minugurulu book introduction meeting : మట్టి తల్లులే అసలైన చరిత్ర నిర్మాతలు అనే నేపథ్యంలో సాగిన మిణుగురులు పుస్తకాన్ని.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, కామర్స్ & లా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూప రాణి రచించారు. ఈ పుస్తక పరిచయ సభకు సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ వేదికైంది. అప్పటి సమాజంలో ఉన్న సామాజిక, ఆర్థిక అసమానతలపై, కుల, మత ఛాందసంపై, అధిపత్య సంస్కృతి లపై పోరాడిన మహిళలను చరిత్రకారులు విస్మరించారని స్వరూప రాణి తెలియజేశారు.
చరిత్రకారులు, ఉద్యమకారులు, స్త్రీ వాదులు, కమ్యూనిస్ట్‌లు గుర్తించని.. 26 మంది వీరవనితల గురించి.. మిణుగురుల పుస్తకం వివరిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి అడ్వకేట్ జహా ఆరా అధ్యక్షతన నిర్వహించారు. ఇందుకు ముఖ్యఅతిధిగా ఉక్కు కర్మాగారం సీవీఓ డాక్టర్ ఎస్ కరుణరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ సీతామహాలక్ష్మి, డాక్టర్ మాటూరి శ్రీనివాస్, బెందాళం కృష్ణారావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి, స్త్రీ శక్తి నాయకురాలు లలిత, బండి సత్యనారాయణ తదితరులు పాల్లొన్నారు.