కానిస్టేబుల్ సహకారంతో వేరొకరితో భార్య సహజీవనం - పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం
Man Tried to Commit Suicide Because of his Wife Illicit Affair:తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. విజయవాడకు చెందిన మణికంఠకు కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం తిరుత్తణికి చెందిన దుర్గ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడ నుంచి బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
Suicide Attemt in Tirupathi: బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మూడు నెలల క్రితం తనతో విభేదించిన దుర్గ తిరుపతికి వచ్చింది. భాకరాపేట చెందిన సోను అలియాస్ భాషాతో దుర్గకు పరిచయం ఏర్పడి సహజీవనం సాగిస్తోందని మణికంఠ తెలిపారు. దీంతో ఇద్దరూ కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో నివాసం ఉంటున్నారు. విషయం తెలిసి బాధితుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకుని కానిస్టేబుల్ శ్రీనువాసులను నిలదీశాడు. దుర్గను వదిలేసి వెళ్లిపోవాలని, లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానని కానిస్టేబుల్ మణికంఠను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మణికంఠ.. పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పివేసి చికిత్స నిమిత్తం అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు.