నచ్చిన బ్రాండ్ అమ్మడం లేదంటూ వైన్‌షాప్‌కు నిప్పుపెట్టిన మందుబాబు!
Man Set Fire Liquor Shop in Visakhapatnam కొమ్మాది కూడలికి సమీపంలో వైన్‌షాప్ నెంబర్ 100లో తాను అడిగిన బ్రాండ్ మద్యం ఇవ్వలేదన్న కోపంతో గుమ్మడి మధు అనే వ్యక్తి హల్ చల్ చేశాడు. తనకు నచ్చిన మద్యం అమ్మడం లేదంటూ దుకాణానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో దుకాణంలోని కొంత సరుకూ, వివిధ సామాగ్రి పాక్షికంగా దగ్ధమైంది. షాప్ నిర్వాహకులు మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో ఒక లక్ష97 వేల రూపాయల నష్టం వాటిల్లినట్లు షాప్ నిర్వాహకులు తెలిపారు. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ప్రిజ్, కొన్ని నగదు నోట్లు కాలిపోయినట్లు పేర్కొన్నారు. 1 లీటర్ పెట్రోల్ బాటిల్ తో దాడి షాప్‌పై దాడి చేసినట్లు తెలిపారు. షాప్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. షాప్ తగలబెట్టడానికి కారణాలను అడిగి తెలుసుకునే దిశగా దర్యాప్తును ప్రారంభించారు.