land rates in guntur " అమ్ముకోలేకపోతున్నాం..! మా భూముల ధరలు తగ్గించండి మహాప్రభో..! "
Published: May 28, 2023, 11:38 AM

Farmers Compliant To Registrations DIG : రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల పేర్కొన్న పాతగుంటూరు పరిధిలోని జాతీయ రహదారి వెంట ఉన్న భూముల విలువపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరం విలువ రూ.5 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించటంతో తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఎకరం విలువ కనీసం కోటి కూడా లేని పొలాలకు.. అంతటి భారీ ధర ప్రకటించటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూముల విలువ పెంచటంతో కొనెందుకు ఎవరు ముందుకు రావటం లేదని రైతులు అంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిల కోసం నగదు అవసరమైతే.. భూములను అమ్ముకోలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులను కలిశామని.. ప్రస్తుతం భూముల విలువ పెంచటంతో స్పందించాలని గుంటూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీకి రైతులు వినతి పత్రం అందించినట్లు వివరించారు. డీఐజీ సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు. అక్కడి భూముల విలువ తగ్గించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన పంపించినట్లు వివరించారన్నారు. అంతేకాకుండా మార్కెట్ విలువ తగ్గింపుపై ఆయన హామీ ఇచ్చినట్లు రైతులు వెల్లడించారు.