అనంతలో కన్నుల పండువగా కురుబ గుడికట్ల ఉత్సవాలు - హజరైన కురుబ కులం అతిరథులు
Kurubala Gudikatla Festival in Ananthapur: అనంతపురంలో కురుబ గుడికట్ల ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. జిల్లా కురుబ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలకు జిల్లా వ్యాప్తంగా 250 గుడికట్ల స్వాములు, భారీ ఎత్తున కురుబ ప్రజలు హాజరయ్యారు. నగరంలోని ఇంటెల్ కళాశాల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుడికట్ల స్వాములకు హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో కళాకారులు చేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమలో పాల్గొన్న స్థానిక యువకులు ఆట, పాటలతో సందడి చేశారు. గుడికట్ల సంబరాలలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకర్ నారాయణ, టీడీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి పాల్గొన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నేతలు కోరుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రం ఘనంగా నిర్వహిస్తామని కురుబ సంఘం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.