విజయవాడలో అంతర్జాతీయ 30వ రైస్ గ్రెయిన్ మిషనరీ ప్రదర్శన
Published: Nov 17, 2023, 6:04 PM

Karumuri Nageswarao in Rice Grain Missionary Exhibition Vijayawada: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాలను ప్రతి మిల్లర్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 30వ అంతర్జాతీయ రైస్ గ్రెయిన్ మిషనరీ ప్రదర్శనలో తెలిపారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన అంతర్జాతీయ 30వ రైస్ గ్రెయిన్ మిషనరీ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన యంత్రాలు పని చేసే విధానాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఆహార ధాన్యాల ఉత్పత్తి, గింజలలో పోషక విలువలు పోకుండా నూతన సాంకేతికత నైపుణ్యం ఎలా పని చేస్తుందో ప్రతి రైతు తెలుసుకోవాలన్నారు. ఇతర దేశాల నుంచి రైస్ గ్రెయిన్ మిషనరీ ఎక్స్‌పోను మిల్లర్లు, రైతుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ (Andhra Pradesh Rice Mill Association) ఆధ్వర్యంలో మూడు రోజులుఈ ప్రదర్శన జరుగుతుందని నిర్వాహకులు ఎస్.కె బాజి తెలిపారు.