KA Paul Visits Avinashs Mother అవినాష్ రెడ్డి తల్లి పరామర్శించిన కేఏ పాల్.. వివేక హత్యకేసులో న్యాయం జరగాలన్న పాల్
Published: May 25, 2023, 9:50 PM

KA Paul Visits YS Avinashs Mother In Kurnool గత కొన్ని రోజులుగా కర్నూలులో చికిత్స పొందుతున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యంపై వాకబు చేసిన ఆయన.. అవినాష్ రెడ్డి తల్లిగారు త్వరగా కొలుకోవాలని దేవుడ్ని ప్రార్ధించినట్లు వెల్లడించారు. బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి వైఎస్ విమలా రెడ్డి వీడియోను చూసి కలత చెందానని, అందుకే కర్నూలుకు వచ్చానని ఆయన అన్నారు. విమలా రెడ్డి, శ్రీలక్ష్మి గారు గతంలో శాంతి సభలకు హజరైయ్యారని కేఏ పాల్ వెల్లడించారు.
వివేక హత్య కేసుపై అవినాష్ ను ప్రశ్నించగా.. తనకు హత్యకు సంబంధం లేదని, అవినాష్ చెప్పినట్లు పాల్ తెలిపారు. అదే సమయంలో వైఎస్ వివేక హత్య కేసులో దోషులకు శిక్షపడాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా వివేక హత్య కేసులో నిజం బయటికి రావాలని పాల్ ఆకాంక్షించారు. అదే సమయంలో నిర్దోషులను దోషిగా చూపించడం తగదని ఆయన అన్నారు.