రాష్ట్రంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందడి - క్రికెట్ మ్యాచ్ కోసం భారీ ఎల్ఈడీ స్క్రీన్లు
Huge LED Screens to Watch World Cup Final Match in AP: రాష్ట్రంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందడి నెలకొంది. క్రికెట్ అభిమానుల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందకు నెల్లూరు, విజయనగరం, తిరుపతిలో పలు చోట్ల భారీ ఎల్ఈడీ (LED) స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు టీమిండియా గెలవాలని క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పెద్దసంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ తిలకిస్తూ కేరింతలు కొడుతున్నారు. ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా మీద భారత్ విజయం సాధించాలని తిరుపతి అశోక్ నగర్లోని శివాలయంలో క్రికెట్ అభిమానులు నవగ్రహ హోమం నిర్వహించారు.
టీమిండియా మూడోసారి విజయం సాధించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం విజయ టాకీస్ ధియేటర్లో మ్యాచ్ వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నెల్లూరులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో భారీ తెర ఏర్పాటు చేసి మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. పెద్దసంఖ్యలో క్రికెట్ అభిమానులు మ్యాచ్ తిలకిస్తూ కేరింతలు కొడుతున్నారు.