Girl Died without Treatment: వైద్యం అందక బాలిక మృతి.. ఖననం చేయడానికి ప్రాణాలకు తెగించిన గ్రామస్థులు
Girl Died without Treatment : రాజకీయ నేతలు ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు. ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ఓటర్లకు రిక్తహస్తం చూపుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి తరలించలేని పరిస్థితిలో ఓ బాలిక వైద్యం అందక కన్నుమూసింది. చివరికి బాలిక మృతదేహాన్ని ఖననం చేయడానికి కూడా కుటుంబసభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న దయనీయ సంఘటన ఇది.
Problems for funeral: అల్లూరి జిల్లా ముంచింగిపుట్ మండలం లక్ష్మీపురం పంచాయతీ తుమ్మడి పొట్టు తుమ్మిడిపుట్టు గ్రామంలో భాను అనే చిన్నారి అనారోగ్యంతో మృతి చెందింది. మృతదేహాన్ని ఖననం చేయడానికి.. పొంగుతున్న వాగులో తరలించడానికి చాలా అవస్థలు పడ్డారు. చివరకు ప్రాణాలకు తెగించి గ్రామస్థులందరూ ఒకరినొకరు పట్టుకుని మృతదేహాన్ని తరలించారు. చికెన్ ఫాక్స్ (Chicken Fox)తో రెండు రోజులుగా బాధపడుతున్నా ఆసుపత్రికి తరలించలేని పరిస్థితిలో మృతి చెందిందని ఆవేదన చెందారు. అరకు ఎమ్మెల్యే పాల్గుణ.. వంతెన నిర్మిస్తానని ఓట్లు వేయించుకుని గెలిచి ఇప్పుడు నెరవేర్చలేదని అందుకే ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ ఓట్లు ఎలా వేస్తామనుకుంటున్నావ్ అని ప్రశ్నించారు. అతి కష్టం మీద మృతదేహాన్ని అవతలి ఒడ్డుకు తరలించి ఖననం చేశారు.