Four Yong Mans Trapped in Penna River Floods Fireman Rescued: పెన్నానదిలో చిక్కుకున్న నలుగురు.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది.. అందరూ సురక్షితంగా ఒడ్డుకు..
Four Yong Mans Trapped in Penna River Floods Fireman Rescued: పెన్నా నదిలోని వరద ప్రవాహంలో చిక్కుకున్న నలుగుర్ని.. సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. నదిలోకి వెళ్లినప్పుడు పెద్దగా వరద లేకపోగా.. ఒక్కసారిగా వచ్చిన వరదకు వారు నదిలో చిక్కుకుపోయారు. మొత్తం పది మంది పెన్నాలోకి వెళ్లగా.. చిక్కుకున్న వారిలో ఆరుగురు వరదలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
వైయస్సార్ కడప జిల్లాలోని చెన్నూరుకు చెందిన పదిమంది యువకులు చేపల వేట కోసమని.. ఆదివారం సాయంత్రం పెన్నా నదిలోకి వెళ్లారు. వారు వెళ్లిన సమయంలో నదిలో వరద అంతగా లేకపోవటంతో.. అక్కడే చేపల వేట కొనసాగించారు. శనివారం రాత్రి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పైనుంచి ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది. దీంతో ఆ పదిమంది యువకులు నదిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. చివరకి ఆరుగురు ఈదుకుంటూ నది ఒడ్డకు చేరుకోగా.. నలుగురు మాత్రం వరద ప్రవాహంలోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం అందించటంతో.. చెన్నూరు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో వరదలో చిక్కుకున్న నలుగుర్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.