UPSC 189 Ranker Interview: "ప్రతి ఒక్కరికి లా అండ్ ఆర్డర్ అందాలనేదే నా కోరిక"
Published: May 24, 2023, 3:42 PM

UPSC 189 Ranker Shaik Habeebulla Interview: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎప్పటిలాగే ఈ సారి కూడా సత్తా చాటారు. అయితే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధం అవ్వడం ఒక ఎత్తైతే... అది దాటి దేశవ్యాప్తంగా ఉండే టాపర్లతో పోటీపడటం అనేది మాములు విషయం కాదు. అందుకే ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ ఆ కలను కొంతమంది మాత్రమే నిజం చేసుకుంటారు. అలా నిజం చేసుకునే వారిలో కర్నూలు జిల్లాకు చెందిన షేక్ అబీబుల్లా కూడా ఒకరు. నిన్న విడుదలైన సివిల్స్ ఫలితాలలో సత్తాచాటి కెరీర్‌కు బంగారు బాటలు వేసుకున్నారు. మరి, ఈ సక్సెస్ సాధించడానికి ఆ ర్యాంకర్ సన్నద్ధం అయ్యారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.