Chandrababu Offers Special Prayers in Iskcon Temple: ఇస్కాన్ ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు.. కృష్ణాష్టమి పూజలు
Chandrababu Offers Special Prayers in Iskcon Temple at Anantapur District: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పర్యటన విజయవంతంగా సాగుతోంది. 'బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారంటీ' కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణదుర్గంలో రైతులతో ముఖాముఖి ప్రజావేదిక నిర్వహించిన అనంతరం.. గుంతకల్లు నియోజకవర్గం గుత్తికి బయలుదేరిన చంద్రబాబు.. మార్గంమధ్యలో ఇస్కాన్ దేవాలయానికి వెళ్లారు. చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికి మర్యాదలతో సత్కరించారు.
కృష్ణ భగవానుడికి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుత్తి బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు.. రెండ్రోజులు కల్యాణదుర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా 'వ్యవసాయ సంక్షోభం'పై ప్రజావేదిక నిర్వహించారు. టీడీపీ హయాంలో చేపట్టిన వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే.. మహిళల్లో చైతన్యం కోసం మహాశక్తి పథకం అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు.