'ఈ నెల 29 నుంచి ప్రజల్లోకి చంద్రబాబు'- బెయిల్ మంజూరుపై టీడీపీ నేతల ఆనందోత్సాహాలు
CBN Bail TDP Celebrations at Party Office: తెలుగుదేశం అధినేత చంద్రబాబు 29నుంచి పులిలా ప్రజల్లోకి వస్తారని నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందన్న ఆనందం కంటే 50రోజులకు పైగా అన్యాయంగా జైల్లో నిర్బంధించారనే బాధే ఎక్కువగా ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు.
TDP Leaders Celebrations on Chandrababu Bail: స్వీట్లు పంచుకుని.. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అవినీతి ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలులేకే పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపే యత్నం చేసి.. వైసీపీ సర్కారు కంగు తినిందంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అవినీతి బురద చల్లటం వైసీపీ తరం కాదని తేల్చిచెప్పారు. చంద్రబాబు పూర్తి స్థాయి కార్యక్రమాలు ఈ నెల 29నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఈ లోపు మిగిలిన కేసుల్లోనూ బెయిల్ వస్తుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.