దేవుడి ఉరేగింపులో పోలీసుల జోక్యం - తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించిన యువకుడు
Published: Nov 18, 2023, 5:49 PM

Boy Suicide Attemt In Anantapur District గ్రామంలో దేవుడి ఊరేగింపులో పోలీసుల జోక్యంపై తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామంలో దుర్గమప్ప దేవుడి గుడికట్ల సంబరాల ఊరేగింపుపై కొంతకాలంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. గ్రామంలో ఊరేగింపు పై వివాదం కోర్టులో జరుగుతుండగానే రాజకీయ ఒత్తిడితో పోలీసుల సమక్షంలో దేవుడి ఊరేగింపు చేశారు. పోలీసులు ఇరు వర్గాల సమ్మతితో ఊరేంగింపు జరపకపోవడం, ఇరుపక్షాలను సంప్రదించకుండా.. ఒక వర్గానికి మద్దతుగా పోలీసులే ముందుండి ఊరేగింపు చేస్తున్నారనే వాదన వ్యక్తమైంది. దీనిపై ఒక వర్గపు ప్రజలు తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రాము అనే యువకుడు ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో చెయ్యేడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసుల భారీగా మోహరింపుతో.. గ్రామంలో టెన్షన్ పరిస్థితులు ఏర్పడ్డాయి.