నిజాంపట్నం హార్బర్లో బోటులో అగ్నిప్రమాదం - పూర్తిగా దగ్ధం
Boat Caught Fire Due to Short Circuit in Nizampatnam : బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చెన్నయ్య అనే వ్యక్తి బోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. జెట్టి వద్ద ఆపి ఉంచిన బోటులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో తీవ్ర నష్టం జరిగింది. ఒక్కసారిగా మంటలు భారీగా ఎగసిపడటంతో నీటిలోనే బోటు పూర్తిగా కాలి బూడిదయ్యింది. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు మత్స్యకారులకు గాయాలు అయ్యాయి.
ఈ అగ్నిప్రమాదం కారణంగా సుమారు రూ. 60 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిన ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే దీపావళి పండుగ కారణంగా.. బోటును జెట్టి వద్ద నిలిపి ఉంచాడు బోటు యజమాని. పండగ తరువాత యథావిధంగా చేపల వేటకు వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఇంతలో అగ్నిప్రమాదం జరిగి బోటు కళ్ల ముందే దగ్ధం అయ్యిందని చెన్నయ్య వాపోతున్నాడు.