హిందూపురంలో బాలయ్య సందడి
Bala krishna Participated Wedding Ceremony at TDP Leader House : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (bala krishna) బుధవారం హిందూపురంలో పర్యటించారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల ఇళ్లలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. నియోజకవర్గంలోని అప్పలకుంటలో సందడి చేశారు. అలాగే హిందూపురంలోని వాల్మీకి భవన్లో జరిగిన వివాహ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. నూతన వధూవరులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
Balayya in Hindupur Constituency : హిందూపురం వచ్చిన నందమూరి బాలకృష్ణకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ వేడుకలకు హాజరైన బాలయ్యను చూసేందుకు అభిమానులు బారులు తీరారు. బాలయ్య నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకల్లో జై బాలయ్య (jai balayya) అనే నినాదంతో మార్మోగింది. అభిమానులు బాలకృష్ణతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. బాలయ్య కూడా అభిమానులతో సెల్ఫీలు దిగారు.